రోజూ మొలకెత్తిన పెసలను తినడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. వయసు పెరిగేకొద్దీ వచ్చే ముడతలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. బరువు తగ్గడం సహా చెడు కొలెస్ట్రాల్ ను నిర్మూలించేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయి. రక్తహీనత తొలగి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, అజీర్ణం వంటి ఇబ్బందులు తొలగిపోతాయి. గుండె, కంటి జబ్బులు రావని చెబుతున్నారు.
అన్నం తినేటప్పుడు నీరు తాగుతున్నారా..?
చాలా మందికి భోజనం చేసే సమయంలో నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే తినేటప్పుడు నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తినేటప్పుడు నీళ్లు తాగితే కడుపులో ఉన్న యాసిడ్ పలుచగా మారుతుంది. దీంతో ఆహారాన్ని జీర్ణం చేయడం కష్టంగా మారుస్తుంది. దీని వల్ల గ్యాస్, మలబద్దకం సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆహారం తీసుకున్న 45 నుంచి 60 నిమిషాల తర్వాత నీరు తాగాలని సూచిస్తున్నారు.