కొద్దిరోజులుగా పరుగులు తీసిన బంగారం ధర మంగళవారం రాత్రి ప్రపంచ మార్కెట్లో దిగివచ్చింది. యూఎస్‌లో ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలకంటే అధికంగా పెరగడంతో ఔన్సు పుత్తడి ధర ఒక్కసారిగా 20 డాలర్లకుపైగా పడిపోయింది. దీంతో దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రా. బంగారం ధర రూ. 420 మేర క్షీణించి రూ. 65,615 వద్దకు తగ్గింది. ఇదే ట్రెండ్ కొనసాగితే బుధవారం ఇక్కడ స్పాట్ మార్కెట్లో ధర తగ్గే అవకాశం ఉంటుంది.