రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మైదానంలో ఒక్కసారిగా స్పైడర్ కెమెరా కుప్పకూలింది. దీంతో మ్యాచ్కు కాసేపు అంతరాయం కలిగింది. స్పైడర్ కామ్ కేబుల్ వైర్ తెగడంతో పడిపోయింది. అయితే అదృష్టవశాత్తు స్పైడర్ కెమెరా పడిన చోట ఆటగాళ్లు లేకపోవడం ఘోర ప్రమాదం తప్పింది. ఈ అనూహ్య ఘటనతో ఆటగాళ్లు అవాక్కయ్యారు.