ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఛాంపియన్స్ లెవల్ టోర్నమెంట్లో భారత నంబర్ వన్ మనికా బాత్రా తొలి రౌండ్లోనే పరాజయం పాలైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 38వ ర్యాంకర్ మనిక 12-10, 9-11, 6-11, 11-8, 8-11తో ప్రపంచ ఆరో ర్యాంకర్ హీనా హయతా (జపాన్) చేతిలో ఓడిపోయింది.
47 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో మనికా బాత్రా కీలక సమయంలో తప్పిదాలు చేసి నిర్ణయాత్మక ఐదో సెట్ లో ఓటమి పాలైంది. తొలి రౌండ్లోనే ఓడిన మనిక బాత్రాకు 3,500 డాలర్లు (రూ. 2 లక్షల 91 వేలు) ప్రైజ్ మనీతోపాటు 15 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.