గిరోనా ఓపెన్ ఏటీపీ ఛాలెంజర్-100 టెన్నిస్ టోర్నీలో భారత ఆటగాళ్ల పోరు ముగిసింది. పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్ చంద్రశేఖర్ తన భాగస్వామి విజయ్ సుందర్ ప్రశాంత్‌తో కలిసి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మూడో సీడ్ శాండర్ ఆరెండ్స్-మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో అనిరుధ్-విజయ్ ద్వయం 4-6, 4-6తో ఓడిపోయింది.
80 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో అనిరుధ్ జోడీ మూడు ఏస్ లు సంధించింది. మూడుసార్లు తమ సర్వీస్‌ను కోల్పోగా, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేశారు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్)-ఆండ్రీ బెగెమన్ (జర్మనీ) జోడీ 4-6, 3-6తో ఫ్రాన్సిస్కో కాబ్రాల్ (పోర్చుగల్)-హెన్రీ పాటెన్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్లోనే ఓడిన అనిరుధ్-విజయ్; బాలాజీ-బాగేమన్ దంపతులకు ప్రైజ్ మనీగా 800 యూరోలు (రూ. 72 వేలు) లభించాయి.