టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ ఇకపై భారత్‌లోనే రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్లను తయారు చేయనుంది. 54 ఏండ్ల చరిత్రలో బ్రిటన్ వెలుపల తొలిసారిగా ఈ మోడళ్లను తయారు చేయనుండటం విశేషం. ఇప్పటి వరకూ యూకేలోని సొలిహల్‌లో గల జాగ్వార్ లాండ్ రోవర్ ప్లాంట్‌లో మాత్రమే ఈ కార్లను తయారు చేసి భారత్ సహా 121 దేశాలకు ఎగుమతి చేస్తోంది. దేశీయంగా కార్ల తయారీ వల్ల ధరలు 18-22 శాతం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.