ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరుణాచల గిరిప్రదక్షిణ అంటే

Bhakthi |  Suryaa Desk  | Published : Fri, Jun 07, 2024, 02:32 PM

అరుణాచలం గిరిప్రదక్షిణ ఎలా చేయాలి...ముఖ్యమైన 44 ఎనర్జీ పాయింట్లు ఏంటి? వేటి తర్వాత ఏవి దర్శించుకోవాలో వివరంగా కథనంలో పొందుపరిచాం.ఆలయ ప్రధాన గోపురం రెండో ప్రాకారంలో బ్రహ్మతీర్థం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభించినప్పటి నుంచి 17 ఎనర్జీ పాయింట్ల గురించి ఓ కథనంలో చెప్పుకున్నాం...18 వ ఎనర్జీ పాయింట్ నుంచి 44 వ ప్రదేశం చేరుకుంటే గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది...బ్రహ్మతీర్థం నుంచి 17 ఎనర్జీ పాయింట్ అయిన నైరుతి లింగం వరకూ వివరాలు , వాటి విశిష్టత తెలుసుకునేందుకు


18.నంది ముఖ దర్శనం - ఇక్కడి నుంచి గిరివైపు చూస్తే..నంది ముఖంలా కనిపిస్తుంది


19.ఎదిర్ నేర్ అన్నామలై - సరిగ్గా ఇది గిరికి వెనుకవైపు ఉంటుంది..ఇక్కడి నుంచి గిరిని చూస్తే శవశక్తి దర్శనం అవుతుంది.. అంటే శివుడు ఓ కొండగా, శక్తి మరోకొండగా కనిపిస్తారు..


20. ఆకాశ నంది - పంచభూతాల్లో భాగంగా ఉండే నందుల్లో నాలుగోది ఆకాశనంది


21. పళని ఆండవార్ ఆలయం- కుమారస్వామి ఇక్కడ తపస్సుచేసి స్వయంభుగా వెలశాడని చెబుతారు..అందుకే ఈ ప్రదేశం అత్యంత పవర్ ఫుల్


22. రాజ రాజేశ్వరి ఆలయం - ఇది చిన్న ఆలయమే కానీ మహాశక్తివంతమైన ఆలయం..ఇక్కడి నుంచి కొండను చూస్తే పార్వతీదేవి కొండ మాత్రమే కనిపిస్తుంది...


23. సింహ తీర్థం , సింహ నంది -పంచభూత నందుల్లో ఇది ఐదోది. ఇక్కడున్న సింహతీర్థంలో నీరు తాగితే ఎంతటి వ్యసనం అయినా మానేయగలుగుతారు...ఓ సారి ప్రయత్నించి చూడండి భక్తితో...


24. కన్నప్ప గుడి - ఇది కూడా అటవీశాఖ అధీనంలో ఉంది. రోడ్డుపైనుంచి నమస్కారం చేసుకోవడమే..


25. గౌతమ ఆశ్రమం - గౌతముడు తపస్సు చేసిన ప్రదేశం ఇది


26. సూర్య లింగం - అరుణగిరిపైనుంచి వెళ్లిన సూర్యుడు తేజస్సు కోల్పోయి ఇక్కడ తపస్సు చేసి మళ్లీ తేజస్సు పొందాడని చెబుతారు. ఇక్కడ ఆదిత్య హృదయం చదువుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్య అయినా పరిష్కారం అవుతుంది..


27. వరుణ లింగం - వరుణ లింగానికి అధిదేవత శని...గ్రహదోషాలు తొలగించే శక్తి ఉన్న లింగం ఇది


28. మాణిక్య వాచకర్ ఆలయం- మాణిక్యవాచకర్ శివభక్తుడు..ఈయన కీర్తిస్తుంటే పరమేశ్వరుడు ఆ శ్లోకాలను రచించి భద్రపరిచాడని చెబుతారు


29. ఆది అణ్ణామలై - బ్రహ్మదేవుడు ప్రతిష్టించిన ఈ శివలింగం అరుణాచలేశ్వరుడి కన్నా ముందే ఉందట..


30. వాయులింగం - ఈ ఆలయంలో కూర్చుంటే బయట ఎండగా ఉన్నా లోపల చల్లగా ఉంటుంది..ఈ క్షేత్రానికి అధిదేవత కేతువు..


31. వాయు నంది - వాయునంది చాలా శక్తివంతమైనది


32. భగవాన్ బ్రిడ్జ్ - రమణ మహర్షి సేదతీరిన ప్రదేశం ఇది..


33. చంద్ర లింగం - చంద్రుడు ప్రతిష్టించిన శివలింగం ఇది...దీనిని దర్శించుకుంటే మీ జీవితంలో ఉండే కష్టనష్టాలు బాధలు తొలగిపోతాయి...


34. అధికార నంది - శ్రీశైలంలో సాక్షి గణపతిలా అరుణాచలంలో అధికారి నంది అలా అన్నమాట..నంది చెవిలో గోత్రనామాలు చెప్పుకోవాలి


35. అగస్త్య ఆశ్రమం - ఇక్కడి నుంచి కొండను చూస్తే శివపార్వతులు ఇద్దరూ కలసి కనిపిస్తారు. ఇక్కడ దర్శనం చేసుకుంటే వివాహం, సంతాన దోషాలు తొలగిపోతాయి


36. కుబేర లింగం - లక్ష్మీదేవి ఈ లింగాన్ని ఆరాధించి కుబేరుడికి అప్పగించింది. ఇక్కడ శివయ్యను దర్శించుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయి.


37. ఇడుక్కు పిళ్లయార్ - చిన్నగా కనిపించే ఇది ఆలయం కాదు. లోపల రెండు యంత్రాలు అమర్చారని...గిరిప్రదిక్షిణ వల్ల వచ్చిన అలసట ఈ ప్రదేశం మాయం చేసేస్తుందని నమ్మకం.


38. పంచముఖ దర్శనం - ఇక్కడి నుంచి గిరిని చూస్తే ఐదు ముఖాలుగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతిని కలిగించే ప్రదేశం ఇది


39. ఊసి లింగం - ఊసి అంటే తమిళంలో సూది అని అర్థం..ఇక్కడ శివలింగం సూది ఆకారంలో ఉంటుంది..


40. పచ్చయ్యమ్మ గుడి - ఇక్కడ శ్యామలాదేవి పచ్చయ్యమ్మన్ స్వరూపంలో కొలువైంది...


41. ఈశాన్య లింగం, యజమాన నంది - ఇక్కడితో అష్టదిక్పాలకుల లింగాల దర్శనం పూర్తవుతుంది.


42. షణ్ముఖ ఆలయం - ఇక్కడ స్వామివారు ఆరుముఖాల్లో దర్శనమిస్తాడు..


43. దుర్గాలయం , ఖడ్గ తీర్థం- ఇక్కడ అమ్మవారు మహిషాసురుడిని సంహరించాడని చెబుతారు


44. ప్రవాళ పర్వతం - గిరిప్రదిక్షిణలో ఆఖరి ప్రదేశం ఇది..రమణమహర్షి తల్లికి ఉపదేశం చేసిన ప్రదేశం ఇది


ఈ 44 ఆలయాలు దర్శించుకునే క్రమంలో మధ్య మధ్యలో మరికొన్ని చిన్న చిన్న ఆలయాలుంటాయి అన్నీ దర్శించుకుని పెద్దాలయం దగ్గరకు చేరుకుంటే గిరిప్రదిక్షిణ పూర్తైనట్టే...ఇదీ గిరిప్రదిక్షిణ చేసిన విధానం..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com