స్వీట్‌కార్న్‌ని చూడగానే ఎవరికైనా ఇట్టే నోరూరుతుంది. రుచిలోనే కాదు.. పోషకాల్లోనూ స్వీట్‌కార్న్ చాలా బెటర్. కాలంతో సంబంధం లేకుండా ఏడాది మొత్తం ఈ తియ్యటి మొక్కజొన్నలు లభిస్తాయి. వీటిని పచ్చిగానైనా, ఉడకబెట్టుకుని అయినా తినొచ్చు. తియ్యటి మొక్కజొన్నల్లోని ఫాస్పరస్, మెగ్నిషీయం, మాంగనీస్, ఐరన్, కాపర్, జింక్ వంటి ఖనిజాలు.. ఎముకలు, కిడ్నీల పనితీరు మెరుగుపడేలా చేస్తాయి. కళ్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.