యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. IND vs ZIM టీ20 మ్యాచు సందర్భంగా గిల్ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రపంచకప్‌లో రోహిత్, విరాట్ ఓపెనింగ్ చేశారు. నేను కూడా టీ20 ఫార్మాట్లో ఓపెనర్‌గా వచ్చా. అంతర్జాతీయ టీ20ల్లోనూ ఓపెనింగ్ బ్యాటర్‌గా రావాలనుకుంటున్నా. జింబాబ్వేతో మ్యాచ్‌లో నాతో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. రుతురాజ్ గైక్వాడ్ మూడో స్థానంలో ఆడతాడు’’ అని చెప్పాడు.