విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు ఎంతో అవసరమని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం. అన్నదొర తెలిపారు. సీతంపేట మండలం సీతంపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో శిక్షా సప్తాహా కార్యక్రమంలో భాగంగా మూడో రోజు గురువారం స్పోర్ట్స్ పాఠశాలలో నిర్వహించారు. అనంతరం డిడి మాట్లాడుతూ ఆటపాటలతో విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. తద్వారా చక్కటి చదువులు చదవాలని ఆకాంక్షించారు.