ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పట్ల అశ్రద్ధ చేస్తున్నారు. దీంతో అనేక వ్యాధుల బారిన పడుతున్నారు.అయితే మనం ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వైద్యుడి వద్దకు వెళ్తాం, అప్పుడు డాక్టర్ మొదట నాలుక చూపించమని అడుగుతాడు. మరి అసలు డాక్టర్ ఎందుకు నాలుకను చూపించమంటాడు, దీనికి గల అసలు కారణం ఏంటీ అని చాలా మందికి ఓ డౌట్ ఉంటుంది. కాగా, అసలు నాలుక ద్వారా ఏ అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోవచ్చు, దాని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరంలోని భాగాలను బట్టి అనారోగ్య సమస్యలను తెలుసుకోవచ్చునంట. అందులో ముఖ్యంగా నాలుక చాలా ప్రత్యేకమైనది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నాలుక రంగును బట్టి చాలా సమస్యలు తెలుసుకోవచ్చు. ఇన్ఫెక్షన్స్ నుంచి క్యాన్సర్ వరకు ప్రతి విషయం నాలుక ద్వారా తెలుస్తోంది. అది ఎలా అంటే? ఒక వేళ మీ నాలుక మీద పగుళ్లు ఏర్పడితే అది స్ట్రోగ్రెన్స్ సిండ్రోమ్ లేదా సోరియాసిస్లకు సంకేతం. ఇది అంత ప్రమాదకరం కాదు, అలాగే నాలుక తెల్లబడినట్లు కనిపిస్తే అది రోగనిరోధక వ్యవస్థకు ఇబ్బంది వచ్చిందని, అంతే కాకుండా అది క్యాన్సర్‌కు కూడా దారి తీసే ఛాన్స్ ఉంటుందంట. నాలుక చాలా ఎర్రగా మారినట్లు అయితే అది విటమిన్ లోపం, జ్వరానికి సంకేతం కావచ్చు అంటున్నారు వైద్యులు. అలాగే నాలుక మృదువుగా మారితే ఇన్ఫెక్షన్స్,ఐరన్ ఫోలిక్ యాసిడ్ లోపం అంట. ఇలా ఈ లక్షణాలను బట్టి డాక్టర్ నాలుకను చూసి వ్యాధిని గుర్తిస్తాడు అంటున్నారు నిపుణులు. నోట్ : పై వార్త నిపుణులు, ఇంటర్నెట్‌లని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది దిశ దీనిని ధృవీకరించలేదు.