ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారిస్ ఒలింపిక్స్‌లో జెండర్ వివాదం..మహిళల పోటీల్లోకి పరుషులను అనుమతించారని ఆరోపణలు

sports |  Suryaa Desk  | Published : Fri, Aug 02, 2024, 10:33 PM

పారిస్ ఒలింపిక్స్‌ 2024లో బాక్సింగ్ పోటీలో మహిళల 66 కేజీ కేటగిరీల బౌట్‌లో ఓ అమ్మాయితో అబ్బాయి పోటీ పడ్డాడంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇలా మహిళల పోటీల్లోకి అబ్బాయిని అనుమతించడం ఏంటని.. అతర్జాతీయ ఒలింపిక్ కమిటీని ప్రశ్నిస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో భాగంగా మహిళల 66 కిలోల కేటగిరీలో బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అల్జీరియా బాక్సర్ ఇమేని ఖేలిఫ్.. ఇటాలియన్ బాక్సర్ ఏంజెలా కారిని తలపడ్డారు. ఈ పోటీలో ఇమేనీ ఖేలిఫ్.. ఇటాలియన్ బాక్సర్ ఏంజెలా కారినీని.. కేవం 46 సెకండ్లలోనే నాకౌట్ చేసింది. కారిని ముఖం మీద ఖెలీఫ్ బలమైన పంచ్ విసిరింది. దీంతో ఆమె మోకాళ్లపై కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత ఆ మ్యాచ్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు కారిని ప్ర‌క‌టించింది. త‌న ప్రాణాల‌ను కాపాడుకునేందుకు త‌ప్ప‌ద‌ని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించింది. పోటీ తర్వాత ఖెలీఫ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సైతం నిరాకరించింది.


46 సెకన్లలోనే ముగిసిన ఈ మ్యాచ్ వివాదాస్పదంగా మారింది. గ‌తేఏడాది జ‌రిగిన జెండ‌ర్ టెస్టులో ఇమేని విఫ‌లం అయింది. దీంతో 2023 చాంపియ‌న్‌షిప్ నుంచి డిస్‌క్వాలిఫై అయ్యింది. జెండ‌ర్ ఇష్యూ వ‌ల్లే ఆమెను ఆ క్రీడ‌ల నుంచి త‌ప్పించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గతేడాది జెండర్ టెస్టులో విఫలమైన ఖెలీఫ్‌ను ఒలింపిక్స్‌లో ఆడేందుకు ఎలా అనుమతిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


25 ఏళ్ల ఇమేని ఖేలిఫ్‌ది .. అల్జీరియాలోని తియారెట్‌. ఆమె యూనిసెఫ్ అంబాసిడ‌ర్ కూడా ఉన్నారు. 2018 ప్రపంచ చాంపియ‌న్‌షిప్ ద్వారా ప్రొఫెష‌న‌ల్ బాక్సింగ్‌లోకి ఆమె అరంగేట్రం చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్ట‌ర్స్‌లో ఓడిపోయింది. 2022 ఆఫ్రిక‌న్ ఛాంపియ‌న్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. అయితే 2023 ప్రపంచ బాక్సింగ్ చాంపియ‌న్‌షిప్‌లో తొలిసారి ఇమేని ఖాలిఫ్‌పై లింగ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో ఢిల్లీలో జ‌రిగిన ఆ పోటీల నుంచి ఆమెను నిషేధించారు. ఆ తర్వాత ఆమెకు నిర్వ‌హించిన డీఎన్ఏ టెస్టు ద్వారా ఆమెకు పరుషుల్లో ఉండే క్రోమోజోములు ఉన్నట్లు తేలిందనే వార్తలు వచ్చాయి.


 


 


ఇక పారిస్ ఒలింపిక్స్‌లో ఖేలిఫ్‌న విజేతా ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోన.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బౌట్ ఇద్దరు సమాన వ్యక్తుల మధ్య జరగ లేదని.. మెలోనీ అన్నారు. తాను మహిళలు ఆడే క్రీడల్లో పురుషులను దూరంగా ఉంచుతానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎలన్ మస్క్ సహా పలువురు ప్రముఖులు.. సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


ఈ వివాదంపై స్పందించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ.. తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఖేలిఫ్ పాస్‌పోర్టుపై ఫిమేల్ అని రాసి ఉంద‌ని, అందుకే ఆమె మ‌హిళ‌ల క్యాట‌గిరీలోని 66 కేజీల విభాగంలో పోటీప‌డుతున్న‌ట్లు అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ ప్ర‌తినిధి మార్క్ ఆడ‌మ్స్ తెలిపారు. మహిళల కేటగిరీలో పోటీపడుతు్న ప్రతి ఒక్కరూ అర్హత నిబంధనలు పాటిస్తున్నారని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com