జామ పండును ఎంతో ఇష్టంగా తింటాం. అయితే కొందరు మాత్రం వీటికి దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భిణులు, పాలిచ్చే మహిళలు జామ పండ్లను తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిదని అంటున్నారు. జామ పండ్లలో కొన్ని రసాయనాలు ఉంటాయి. ఇవి కొన్నిసార్లు చర్మం మీద చికాకు కలిగిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే తక్కువగా ఉన్నవారు జామ పండ్లు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా తగ్గిపోతాయి.