ప్యారిస్ ఒలింపిక్స్‌లో ఈ రోజు బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీస్ పోరు జరిగింది. ఇందులో భారత యువ బ్యాడ్మింటన్ లక్ష్యసేన్ డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అక్సెల్సెన్ పోటీ పడ్డారు. రెండు సెట్‌లలో లక్ష్యసేన్ శుభారంభం చేసినా.. విక్టర్ ఆ తర్వాత చెలరేగి పైచేయి సాధించాడు. లక్ష్యసేన్‌పై విక్టర్ విజయం సాధించారు. విక్టర్ ఫైనల్‌కు వెళ్లారు. దీంతో లక్ష్యసేన్ గోల్డ్ లేదా సిల్వర్ మెడల్ సాధించే అవకాశాన్ని కోల్పోయారు. కానీ, కాంస్య పతకం గెలిచే అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. రేపు జరిగే కాంస్య పతక పోరులో మలేషియా షట్లర్ లీజీ జియాతో లక్ష్యసేన్ తలపడాల్సి ఉన్నది. ఈ పోరులో నెగ్గితే కాంస్య పతకాన్ని సాధిస్తారు.
పారిస్ ఒలింపిక్స్ 2024 లో సెమీస్ వరకు భారత యువ ఆటగాడు లక్ష్యసేన్ దూసుకొచ్చాడు. ఎదురేలేదన్నట్టుగా విజయాలు సాధించాడు. కానీ, పురుషుల సింగిల్స్ సెమీస్ ఆటలో లక్ష్యసేన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్ విక్టర్ అల్సెక్సెన్ చేతిలో ఓడిపోయాడు. 20-21, 14-21 స్కోర్‌తో లక్ష్యసేన్ ఓటమి చవిచూశాడు. ఈ రెండు సెట్‌లలో కూడా లక్ష్యసేన్ తొలుత ఆధిక్యం ప్రదర్శించాడు. కానీ, ఆ తర్వాత విక్టర్ విజృంభించి లక్ష్యసేన్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. రెండో సెట్‌లో కూడా లక్ష్యసేన్ ఏడు పాయింట్లు సాధించినప్పుడు విక్టర్ సున్నా వద్దే ఉన్నాడు. కానీ, ఆ తర్వాత విక్టర్ పుంజుకున్నాడు. లక్ష్యసేన్ మరో ఏడు పాయింట్లు సాధించేలోపు విక్టర్ 21 పాయింట్లు సొంతం చేసుకున్నాడు, తద్వార రెండో సెట్‌తోపాటు మ్యాచ్‌ను గెలుచుకున్నాడు.