పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ ముంగిట అనర్హత వేటు పడిన వినేశ్ ఫొగాట్‌కు సన్మానం చేయాలని హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పతకం సాధించినట్లు భావించి సత్కారిస్తామని ప్రకటించిన సీఎం నాయబ్ సింగ్ సైనీ తెలిపారు. ఈ నేపథ్యంలో వినేశ్ ఫొగాట్‌కు హరియణా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. వినేష్ ఫోగట్ దాదాపు రూ.4 కోట్ల నజరానా అందుకోనున్నారు.