ప్రముఖ క్రికెటర్ యువరాజ్‌సింగ్ ఎంతోమందికి అభిమాన ఆటగాడు. యువరాజ్ ఒక్క ఓవర్లో 6 సిక్సులు కొట్టి ప్రపంచ రికార్డు సైతం సృష్టించాడు. అయితే క్యాన్సర్ బారిన పడి క్రికెట్‌కు దూరమైన యువరాజ్‌సింగ్ అంతర్జాతీయ సైకిలిస్టు లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ రచించిన ఆత్మకథ పుస్తకం చదివిన తర్వాత ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశారు. మనోధైర్యంతో వ్యాయామాలు చేశారు. తిరిగి మైదానంలోకి అడుగుపెట్టి ఎందరికో ప్రేరణగా నిలిచారు.