నరసన్నపేట మండలంలోని స్థానిక వీరన్నాయుడు కాలనీ వద్ద కొలువై ఉన్న శ్రీ సంతోషిమాత ఆలయంలో భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. శుక్రవారం శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా స్థానిక ఆలయంలో కుంకుమ అర్చనలు కార్యక్రమాన్ని నిర్వహించామని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అర్చనల్లో భాగంగా సుమారు 116 మంది ముత్తైదువులు పాల్గొనడం విశేషమని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa