ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తక్కువ వడ్డీకే 'హోమ్ లోన్' ఇస్తోన్న బ్యాంకులివే

business |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 11:05 PM

ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ కొనుగోలు కోసం హోమ్ లోన్స్ తీసుకుంటుంటాం. అలాగే ఇంటి నిర్మాణం కోసం ల్యాండ్ కొనేందుకూ హోమ్ లోన్ తీసుకోవచ్చు. అలాగే పాత ఇంటిని పునరుద్ధరించేందుకు, అదనపు నిర్మాణాలు, మెయింటెనెన్స్ కోసం గృహ రుణాలు ఇస్తాయి బ్యాంకులు. దీర్ఘకాలం పాటు లోన్ తిరిగి చెల్లించే అవకాశం కల్పిస్తూ తక్కువ వడ్డీకే లోన్స్ ఇస్తుంటాయి. హోమ్ లోన్స్ అనేవి ఈఎంఐలుగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయి? ఎందులో ఛార్జీలు తక్కువగా ఉన్నాయి ? అనే సంబంధిత వివరాలను తెలుసుకుని లోన్ తీసుకోవడం ద్వారా ఈఎంఐల అదనపు భారాన్ని తగ్గించుకోవచ్చు.


ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం హోమ్ లోన్స్ అనేవి మూడు రకాల వడ్డీ రేట్లతో ఇస్తుంటాయి బ్యాంకులు. అవి ఫ్లోటింగ్ రేటు వడ్డీ రేట్లు, ఫిక్స్‌డ్ వడ్డీ రేట్లు, మిక్స్‌డ్ వడ్డీ రేట్లు గా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రేట్ల మార్పును బట్టి ఫ్లోటింగ్ రేటు వడ్డీ రేట్లు మారుతుంటాయి. రెపో రేటు తగ్గినప్పుడు బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గిస్తాయి బ్యాంకులు. అదే విధంగా పెరిగినప్పుడు పెంచుతాయి. ఫిక్స్‌డ్ రేట్లు అంటే లోన్ టెన్యూర్ ముగిసే వరకు ఒకే వడ్డీ రేటు ఉంటుంది. మిక్స్‌డ్ వడ్డీ రేట్లలో రెండూ ఉంటాయి. మరోవైపు.. హోమ్ లోన్ ఇచ్చే ముందు బ్యాంకులు క్రెడిట్ స్కోర్, లోన్ అమౌంట్, ఎల్‌టీవీ రేషియో, ఉద్యోగం, వడ్డీ రేట్ల విధానం వంటి వాటి ఆధారంగా ఎంత వడ్డీ అనేది నిర్ణయిస్తాయి.


ప్రస్తుతం రూ.75 లక్షలు ఆపైన హోమ్ లోన్స్‌పై బ్యాంకుల్లో ఉన్న తక్కువ వడ్డీ రేట్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8.50 శాతం నుంచి 9.85 శాతం మధ్య వడ్డీ రేట్లు ఉన్నాయి.


బ్యాంక్ ఆఫ్ బరోడాలో 8.40-10.90 శాతం వరకు వడ్డీ రేట్లు వసూలు చేస్తోంది.


యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8.35-10.90 శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి.


పంజాబ్ నేషనల్ బ్యాంకులో 8.40- 10.15 శాతం వడ్డీ వసూలు చేస్తోంది.


బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8.40- 10.85 శాతం వడ్డీ ఉంది.


కెనరా బ్యాంకులో 8.40 - 11.15 శాతం మేర వడ్డీ వసూలు చేస్తోంది.


యూకో బ్యాంకులో హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.45- 10.30 శాతం ఉన్నాయి.


బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 8.35- 11.15 శాతం వడ్డీ వసూలు చేస్తోంది.


పంజాబ్ అండ్ సింధు బ్యాంకులో 8.50- 10 శాతం వడ్డీ ఉంది.


ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 8.40- 10.60 శాతం వడ్డీ వసూలు చేస్తోంది.


సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8.45- 9.80 శాతం వడ్డీ ఉంది.


కోటక్ మహీంద్రా బ్యాంకులో 8.70 శాతం నుంచి వడ్డీ రేట్లు మొదలవుతున్నాయి.


ఐసీఐసీఐ బ్యాంకులో 8.75 శాతం వడ్డీ ఉంది.


యాక్సిస్ బ్యాంకులో 8.75- 9.65 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తోంది.


సౌత్ ఇండియన్ బ్యాంకులో 8.70- 11.70 శాతం వడ్డీ ఉంది.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 8.75 శాతం నుంచి వడ్డీ రేట్లు మొదలవుతున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com