భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ కెరీర్‌పై చర్చ నడుస్తున్న సమయంలో అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్. మహీ భాయ్‌పై రూ.15 కోట్ల చీటింగ్ కేసు నమోదైంది. దాంతో, ఈ కేసుపై అభిప్రాయం తెలపాల్సిందిగా ఆదివారం భారత క్రికెట్ నియంత్రణ మండల మహీ భాయ్‌ను కోరింది. బీసీసీఐకి చెందిన ఎథిక్స్ కమిటీ ధోనీకి ఆగస్టు 30వ తేదీ వరకూ గడువు విధించింది.ఉత్తరప్రదేశ్‌లోని అమేథికి చెందిన రాజేశ్ కుమార్ మౌర్య అనే వ్యక్తి ధోనీ తనను రూ. 15 కోట్లు మోసగించాడని బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. బీసీసీఐ ఎథిక్స్ కమిటీ నిబంధన 36 కింద ఆ కేసును రిజిష్టర్ చేసుకుంది. మిహిరా దివాకర్ అనే వ్యక్తిపై ధోనీ పెట్టిన రూ.15 కోట్ల స్కామ్ కేసుకు దీనికి సంబంధం ఉంది.మహీని రాజేశ్ కుమార్ నమోదు చేసిన ఫిర్యాదుపై స్పందించాల్సింది బీసీసీఐ కోరింది.