ప్రస్తుత కాలంలో ఏ సామాను మోసుకొని రావాలన్న చేతిలో ప్లాస్టిక్ కవర్ ఉండాల్సిందే. అలా మన జీవితంలో నిత్యవసర వస్తువుగా మారింది ఈ ప్లాస్టిక్ భూతం. ఇంకో సంచలన విషయం ఏంటంటే.. భారతదేశంలో దొరికే ఉప్పు, చక్కెర.. ప్యాక్ చేసి అమ్మినా.. లూజుగా అమ్మినా.. అందులో ప్లాస్టిక్ ముక్కలు కనిపిస్తున్నాయని టాక్సిక్స్ లింక్ అనే పర్యావరణహిత సంస్థ రిసెర్చ్ చేసి చెప్పింది. అన్ని బ్రాండ్ల ఉప్పు ప్యాకెట్లు, చక్కెర ప్యాకెట్లలో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని వెల్లడించింది.