కీరదోస సాగు విధానం చాల సులభంగా ఉంటుంది. మొదటగా భూమిని మెత్తగా దుక్కిదున్ని, ఆరడుగు వెడల్పుతో బోదలు తీసి.. వాటి వెంట విత్తనాలు విత్తాలి. 30 రోజుల్లో పంట దిగుబడి వస్తుంది. పంట గడువు కాలం 75రోజులు. 35వ రోజు నుంచి దిగుబడి వస్తుంది. ఎకరాకు 10 వేల గింజలు సరిపోతాయి. దాదాపు ఎకరాకు 100 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నీటి లభ్యత దృష్ట్యా రైతులు తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.