యూజర్ల ప్రైవసీకి మరింత రక్షణ కల్పించేందుకు వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఇకపై ఫోన్ నంబర్‌తో పనిలేకుండా యూజర్నేమ్తోనే మెసేజ్‌లు పంపేలా సరికొత్త ఫీచర్‌ను జోడించబోతుంది. కొత్త వ్యక్తికి మన నంబర్ ఇచ్చేందుకు సంకోచించే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అయితే, యూజర్ నేమ్ చెప్పే సమయంలో మన నాలుగు అంకెల పిన్ నంబర్‌ను కూడా చెప్పాల్సి ఉంటుంది. దీనిని మనమే క్రియేట్ చేసుకోవచ్చు.