కృష్ణాష్టమి రోజున మాంసాహారం, మద్యాన్ని తీసుకోరాదు. భక్తులెవ్వరూ ఈ రోజున తులసి ఆకులు కోయకూడదు. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున ఎవరిని కించపరచకూడదు. అలాగే బ్రహ్మచార్యం పాటించాలి. పవిత్రమైన తనుమనస్సులతో గోవిందుడిని పూజించాలి. కృష్ణాష్టమి రోజున చెట్లను నరకడం చాలా దురదృష్టమని అంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంట చెట్లను నరకడం, మొక్కలను తుంచటం చేయకూడదు. ఆ గోపాలుడికి ఆవులు, దూడలు అంటే ఎంతో ప్రేమ. ఆవులను అగౌరవపరిస్తే కన్నయ్య ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందంట.