చాలామంది వేరుశనగను ఇష్టంగా తింటుంటారు. రోజూ తినే ఆహారంలో ఏదో విధంగా తీసుకుంటారు. ముఖ్యంగా వేరుశనగ చట్నీ, నానబెట్టి తింటుంటారు. వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంటారు.వేరుశనగను పచ్చిగా కాకుండా ఉడికించి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ప్రొటీన్లు, విటమిన్లు, కాపర్, ఐరన్, జింక్, కాల్షియం, సెలీనియం, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ప్రతిరోజు తినడం వల్ల ఆరోగ్యం కుదట పడటంతో పాటు జుట్టు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మరి వీటిని రోజూ ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది? వీటివల్ల కలిగే ప్రయోజనాలేంటో మరి తెలుసుకుందాం.
వేరుశనగ గింజలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఇలా రోజూ తినడం వల్ల తొందరగా బరువు పెరుగుతారు. అలాగే పరగడుపున తినడం వల్ల శరీరానికి ప్రయోజనాలు చేకూరతాయి. వేరుశనగల్లో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి. కొంతమంది వీటిని ఉడికించి తింటారు. ఇలా తినడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోజూ తినే డైట్‌లో ఏదో విధంగా వీటిని యాడ్ చేసుకుంటే ఎముకలు దృఢం అవుతాయి. అయితే నాన బెట్టిన వేరుశనగల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. బాడీలో చెడు కొలెస్ట్రాల్ రాకుండా తగ్గిస్తాయి. వీటిలో ఉండే పోషకాలు వెన్ను నొప్పిని తగ్గించడంలో సాయపడతాయి. శారీరక శ్రమ లేకుండా ఒకే దగ్గర కూర్చోని పని చేసేవాళ్లు వీటిని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. నాన బెట్టిన వేరుశనగలతో బెల్లం కలిపి తింటే బాడీలో ఐరన్ పెరుగుతుంది.
వేరుశనగలను నానబెట్టి లేదా ఉడికించి పిల్లలకు ఇస్తే వాళ్ల జ్ఞాపక శక్తి మెరుగు పడుతుంది. వీటిలో ఉండే విటమిన్లు, పోషకాలు మతి మరుపు రాకుండా చేస్తుంది. అలాగే కంటి చూపు మెరుగుపడటంతో పాటు అల్జీమర్స్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. వీటివల్ల జుట్టు, చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇందులో ఉండే కొవ్వులు, విటమిన్ల వల్ల జుట్టు బలంగా ఉంటుంది. చర్మంపై ఎలాంటి ముడతలు, మచ్చలు ఉన్న తగ్గుతాయి. రోజూ ఉదయం నాన బెట్టిన వేరుశనగ గింజలను తినడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే గుండె పోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటితో పాటు జీవ క్రియ, గ్యాస్, మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. కేవలం శారీరక సమస్యలను తగ్గించడంతో పాటు మానసిక సమస్యలను కూడా తగ్గిస్తుంది. వేరుశనగలో ఉండే ఫోలేట్, నియాసిన్.. మానసిక సమస్యలు రాకుండా కాపాడుతుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన నుంచి విముక్తి కల్పించేలా సాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల వాపు వంటి సమస్యలను తగ్గిస్తాయి.