శ్రావణ మాసంలో చివరి రోజును పోలాల అమావాస్య అంటారు. ఆ రోజున గోమాత పేడతో అలికి పసుపు, కుంకుమతో రాసి, కందమొక్కను నాటాలి. కందమొక్కను అమ్మగా భావించి 9 వరుసల దారంతో పసుపు కొమ్ము కట్టి, ఆ తోరాన్ని కందమొక్కకు కట్టి పూజ చేయాలి.
9 వరుసల తోరం పేరాంటాలకు ఇచ్చి మనం కట్టించుకోవాలి. పిండి వంటలను అమ్మవారికి నివేదన చేయాలి. భోజనం చేసిన తర్వాత తాంబూలం, దానధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు మరణించకుండా కలరా, మలేరియా, మశూచి తదితర వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు.