చాలా మంది ఇళ్లలో దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు మస్కిటో కాయిల్స్ వాడుతుంటారు. అయితే వీటి వల్ల చాలా అనర్థాలున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మస్కిటో కాయిల్ పొగ పీల్చడం వల్ల ఊపిరితిత్తులు అనారోగ్యానికి గురవుతాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. వీటి పొగ వల్ల తలనొప్పి, స్కిన్ అలర్జీలు వస్తాయి. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వీటిని వెలిగించకపోవడం మంచిది.