ఎండు మిర్చి కారంను వంటల్లో ఎక్కువగా వాడుతుంటారు. ముఖ్యంగా మాంసాహారం వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే కారం ఎక్కువగా తినడం వల్ల అధిక రక్తపోటు, అల్సర్ వంటి సమస్యలు వస్తాయి.
అంతేకాకుండా కడుపు నొప్పి, దద్దుర్లు, వాంతులు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల కారం ఎక్కువగా తినకుండా పచ్చిమిర్చి కారం తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.