యాలకుల పాలను తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. యాలకుల పాలు తాగడం వల్ల మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం లభిస్తాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచి, సీజనల్గా వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు తోడ్పడతాయని సూచిస్తున్నారు.