పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో రెండో సిల్వర్ మెడల్ చేరింది. సోమవారం జరిగిన పోటీల్లో పారా అథ్లెట్ యోగేశ్ కుతునియా రజతం దక్కించుకున్నాడు. డిస్కస్ త్రోవర్ F56 విభాగంలో పోటీ పడ్డ యోగేశ్ 42.22మీటర్ల ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచాడు. కాగా, పారాలింపిక్స్‌లో సిల్వర్ దక్కించుకోవడం ఇది వరుసగా రెండోసారి. 2020 టోక్యోలోనూ అతడు రజతం సాధించాడు. దీంతో పారిస్ పారాలింరిక్స్లో భారత్ పతకాల సంఖ్య ఎనిమిదికి చేరింది.