ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్‌లు ... ఇవీ డిటైల్స్‌..!

Technology |  Suryaa Desk  | Published : Mon, Sep 02, 2024, 08:27 PM

కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఏ బ్రాండ్ ఫోన్ కొంటే బావుటుందని అనుకుంటున్నారు. ఆగస్టు నెలలో చాలా స్మార్ట్‌ఫోన్‌లు టెక్ మార్కెట్‌లోకి వచ్చాయి.వాటిలో ఒకటి కాదు, రెండు కాదు.. ప్రీమియం నుండి మిడ్ రేంజ్, బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్‌లు ఉన్నాయి. ఏ స్మార్ట్‌ఫోన్‌లో బెస్ట్ ఫీచర్లు ఉన్నాయో ఎంచుకోవడం కష్టమే. పోని ప్రైస్ విషయంలో కాంప్రమైజై హై రేంజ్‌కి వెళదమా?. అదేమో మన బడ్జెట్ కాదు. ఈ క్రమంలోనే తక్కువ ధరలో మంచి ఫీచర్లు అందిచే 5 స్మార్ట్‌ఫోన్లు గురించి తెలుసుకుందాం. వాటిలో మీకు గొప్ప కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్, స్క్రీన్ లభిస్తాయి. ఈ జాబితాలో Motorola, Realme, IQOO, Vivo, Nothing ఫోన్‌లు ఉన్నాయి.


Realme 13+ 5G


Realme ఇటీవలే 13 ప్లస్ 5Gని విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 22,999. Realme 13+ 120Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 2000 nits పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 4nm ప్రాసెసర్, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కెమెరా గురించి చెప్పాలంటే ఇందులో 50MP Sony LYT-600 మెయిన్ కెమెరా, 2MP మోనో సెన్సార్, 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.


Moto G45 5G


మోటో ఈ బడ్జెట్ ఫోన్ ఆగస్టు 21 న విడుదలైంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.10,999. ఫోన్ బ్రిలియంట్ బ్లూ, బ్రిలియంట్ గ్రీన్, వివా మెజెంటా కలర్స్‌లో వస్తుంది. Moto G45 5G 720x1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 6s Gen 3 చిప్‌సెట్ ప్రాసెర్ ఉంటుంది. దీనిలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. వీటితో పాటు LED ఫ్లాష్ కూడా ఉంది. ఫోన్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. పవర్ కోసం ఫోన్ 5000 mAh పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. దీనితో 20W ఛార్జర్‌ను కూడా అందించింది.


 


Vivo T3 Pro 5G


Vivo ఇటీవల దేశంలో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది రూ. 24,999 ప్రారంభ ధరతో వస్తుంది. సెప్టెంబర్ 3న ఫ్లిప్‌కార్ట్‌లో జరిగే మొదటి సేల్ సందర్భంగా హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్ వినియోగదారులు ఈ ఫోన్‌పై రూ.3,000 తగ్గింపును పొందుతారు. స్మార్ట్‌ఫోన్ 50MP OIS, Sony IMX882 కెమెరా, 4500 nits బ్రైట్నెస్‌తో 6.77-అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 7 Gen 3 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంటుంది. Vivo T3 Pro 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.


 


iQOO Z9s Pro


ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్, ఫీచర్లు దాదాపు Vivo T3 Pro 5Gని పోలి ఉంటాయి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల FHD+ (2392×1080 పిక్సెల్‌లు) కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Snapdragon 7 Gen 3 SoC ప్రాసెసర్‌తో వస్తుంది. iQOO Z9s ప్రో 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని కూడా ప్యాక్ చేస్తుంది. ఈ iQOO ఫోన్ ధర రూ. 24,999 నుండి ప్రారంభమవుతుంది.


 


Motorola Edge 50 5G


మోటరోలా Edge 50 గత నెల ప్రారంభంలో సేల్‌కి వచ్చింది. ఇది మిడ్ రేంజ్ ఫోన్. ఈ ఫోన్ 8GB + 256GB వేరియంట్‌లో మాత్రమే విడుదలైంది. దీని ధర రూ. 27,999గా ఉంది. ఈ ఫోన్ Snapdragon 7 Gen 1 Accelerated Edition చిప్‌సెట్‌తో వస్తుంది. Motorola మూడు సంవత్సరాల OS అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాల భద్రతా ప్యాచ్‌లతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 50 50MP Sony-Lytia 700C ప్రైమరీ కెమెరా, 10MP 3x టెలిఫోటో కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ కూడా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com