ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చియా సీడ్స్ వాటర్ ను రోజూ తీసుకుంటే..

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Sep 05, 2024, 03:44 PM

చియా సీడ్స్ ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతున్న గింజలు. వీటిని నీటిలో నానబెట్టి ఫుడ్డింగ్ గానూ, ఓట్స్ లోనూ, నీటిలోనూ తీసుకుంటూ ఉంటారు. బరువు తగ్గడానికి , ఫిట్ గా ఉండటానికి వాడుతుంటారు.వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుస్తాయి. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని చియా సీడ్స్ ను తెగ వాడేవారికి బ్యాడ్ న్యూస్.. చియా సీడ్స్ గురించి ఆహార నిపుణులు చెప్పిన నిజాలు ఏంటంటే..చియా సీడ్ వాటర్ ను రోజూ తీసుకుంటే జీర్ణక్రియ పాడవుతుంది. దీంతో పాటూ అలెర్జీలు కూడా రావచ్చు. ఇప్పటికే పేలవమైన జీర్ణక్రియ, అలెర్జీ సమస్యలు ఉన్నవారు చియా సీడ్స్ ను తీసుకోకపోవడమే మంచిది.చియా సీడ్స్ లో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో నీటిని ఎక్కువగా గ్రహిస్తుంది. వీటి పరిమాణం కంటే 10 నుండి 12 రెట్లు ఎక్కువ నీటిని ఇవి గ్రహిస్తాయి. చియా సీడ్ వాటర్ ను ఎక్కువగా తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్ కు లోనవుతుంది.చియా సీడ్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణం కావడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కడుపులో గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.చియా గింజలలో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయట. వీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే శరీరంలో కేలరీల పరిమాణం కూడా పెరుగుతుందట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com