భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ రైల్వేలో ఉద్యోగానికి శుక్రవారం రాజీనామా చేశారు. ఇప్పటి వరకు ఆమె రైల్వేలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD)గా ఉద్యోగం చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఆమె ఈ ఉద్యోగం పొందారు. కాసేపటిలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
ఇక త్వరలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు మరో రెజ్లర్ బజరంగ్ పునియా సైతం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.