ఒక టార్గెట్ అనుకుని వెళ్లడం వేరు, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అద్భుతమైతే, అంతకుమించి సాధించడమనేది మహాద్భుతమని అందరూ భారత అథ్లెట్లను అభినందిస్తున్నారు. పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు 29 పతకాలతో మెరిశారు. విశ్వ క్రీడల్లో భారత పతాకం సగర్వంగా ఎగిరేలా చేశారు. పారిస్ పారాలింపిక్స్ లో పాల్గొనేందుకు భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు బయలుదేరారు. 29 మెడల్స్ సాధించారు. ఇందులో ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. పారాలింపిక్స్ లో పాల్గొన్న దేశాల్లో 18వ స్థానంలో నిలిచారు. గత టోక్నో పారాలింపిక్స్ 19 పతకాలను సాధించిన భారత్, ఈసారి అంతకుమించి 10 పతకాలను అధికంగా సాధించడం విశేషం. 1968 నుంచి పారాలింపిక్స్‌లో చూస్తే, 2024లోనే అత్యధికంగా 29 మెడల్స్ సాధించి రికార్డు సృష్టించారు.