ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా T20 మరియు ODI మ్యాచ్.. ఎప్పుడంటే... ?

sports |  Suryaa Desk  | Published : Tue, Sep 10, 2024, 11:08 PM

గత నెల రోజులుగా అగ్రశ్రేణి జట్ల మ్యాచ్‌లు లేక తల్లడిల్లిపోతున్న క్రికెట్ అభిమానులకు పండగలాంటి వార్త ఇది. బుధవారం(సెప్టెంబర్ 11) నుంచి ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా జట్ల మధ్య పరిమిత ఓవర్ల క్రికెట్ షురూ కానుంది. ఈ ఇరు జట్ల మధ్య 3 టీ20లు, 5 వన్డేలు జరగనున్నాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిరీస్ అంటే హోరాహోరీ పోరు తప్పదు. సొంతగడ్డపై ఆడుతుండటం ఇంగ్లండ్‌కు కలిసొచ్చేదే అయినప్పటికీ.. ఆస్ట్రేలియా జట్టును తక్కువ అంచనా వేయలేం. శ్రీలంకపై టెస్ట్ సిరీస్ నెగ్గి ఇంగ్లీష్ జట్టు మంచి ఊపు మీదుండగా టీ20లు రాత్రి 11 గంటలకు ప్రారంభం కానుండగా.. వన్డేలు మధ్యాహ్నం 3;30 గంటలకు, సాయంత్రం 6:30 గంటలకు మొదలు కానున్నాయి. ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా వైట్-బాల్ సిరీస్ లైవ్ మన దేశంలోని సోనీ స్పోర్ట్స్ 5, సోనీ స్పోర్ట్స్ 5 HD ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. డిజిటల్ గా Sony Live యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ ఆస్వాదించవచ్చు. ఫ్యాన్‌కోడ్ యాప్ లోనూ ప్రత్యక్ష ప్రసారాలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com