ఆపిల్ కంపెనీ అద్భుతమైన ఐఫోన్ 16 సిరీస్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. గత సంవత్సరం రిలీజ్ చేసిన 15 సిరీస్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ ఐఫోన్ 16 మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటి ఫీచర్స్ వినియోగదారులను చాలా ఆకట్టుకుంటున్నాయి. ఐఫోన్ 16 సిరీస్ మోడల్స్‌ను మీరు కొనాలనుకొనుకుంటే వాటి కామన్ ఫీచర్స్, మోడల్స్ మధ్య తేడాలు ఇతర విషయాలు ఇక్కడ తెలుసుకోండి. "ఆపరేటింగ్ సిస్టమ్": ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ మోడల్స్‌లో లేటెస్ట్ వర్షన్ iOS 18 అందుబాటులో ఉంటుంది. ఇది మెరుగైన పనితీరు, కొత్త ఫీచర్లు, ఆప్టిమైజేషన్ కలిగి ఉంటుంది. ఐఫోన్ 16 సిరీస్‌లోని ప్రధాన ఫ్యూజన్ లెన్స్ వేడిని తగ్గించడానికి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్‌ను కలిగి ఉంది. అధునాతన 5 నానోమీటర్ టెక్నాలజీతో తయారు చేయబడిన A18 బయోనిక్ చిప్ ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ మోడల్స్‌లో అమర్చారు. ఇది వేగవంతమైన ప్రాసెసింగ్, మెరుగైన బ్యాటరీ లైఫ్, ఎఫిషియన్సీని అందిస్తుంది. "డిస్‌ప్లే": ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ ఈ మోడల్స్ అన్నీ OLED డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఇది సూపర్ రెటినా XDR టెక్నాలజీతో గొప్ప రంగులు, హై కాంట్రాస్ట్ రేషియో, డీప్ బ్లాక్స్‌ను అందిస్తుంది.