అనంతపురం పిచ్ పై ప్రథమ్ సింగ్ శనివారం అదరగొట్టారు. భారత్-ఏ జట్టుకు ఆడుతున్న అతడు 153 బంతుల్లో సెంచరీ (103 ) చేశారు. కావేరప్ప బౌలింగ్లో 6, 4, 4 బాది దులీప్ ట్రోఫీలో మెయిడెన్ సెంచరీ చేశారు.
డీ టీమ్ పై ప్రస్తుతం ఏ జట్టు 306 పరుగుల ఆధిక్యంలో ఉంది. అనంతపురం మైదానంలో ఇది రెండో సెంచరీ. రెండ్రోజుల క్రితం ఇషాన్ కిషన్ శతకం బాదిన విషయం తెలిసిందే. స్థానిక అభిమానులతో స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది.