ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలివేట్ SUV కొత్త అపెక్స్ ఎడిషన్‌ను విడుదల

Technology |  Suryaa Desk  | Published : Mon, Sep 16, 2024, 04:41 PM

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఎలివేట్ SUV కొత్త అపెక్స్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ది గ్రేట్ హోండా ఫెస్ట్ సందర్భంగా ఈ ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.అపెక్స్ ఎడిషన్ లిమిటెడ్ వాల్యూమ్‌లలో ట్రాన్స్‌మిషన్ MT, CVT రెండింటిలోనూ వస్తుంది. ఇది హోండా ఎలివేట్ V, VX గ్రేడ్‌లపై ఆధారపడి ఉంటుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.12.86 లక్షలుగా నిర్ణయించారు. సాధారణ వేరియంట్‌తో పోలిస్తే దీని ధర రూ. 15 వేలు ఎక్కువ. భారతీయ మార్కెట్లో,ఇది మారుతి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌లకు పోటీగా ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.ఈ కొత్త ఎడిషన్‌లో కంపెనీ ముందు, వెనుక బంపర్‌లకు పియానో ​​బ్లాక్ గార్నిష్‌ను అందించింది. కంపెనీ కొత్త ఎడిషన్‌లో కొత్త పియానో ​​బ్లాక్ డోర్ గార్నిష్‌ను కూడా జోడించింది. అపెక్స్ ఎడిషన్ సైన్ ఫ్రంట్ ఫెండర్, టెయిల్ గేట్‌పై కూడా ఉంచబడింది. లోపలి భాగంలో ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ కొత్త డ్యూయల్-టోన్ ఐవరీ, బ్లాక్ ఇంటీరియర్ కలర్ స్కీమ్‌ను పొందుతుంది.


ఈ స్కీమ్ సాధారణ ఎలివేట్‌లో ఇప్పటికే ఉన్న టాన్, బ్లాక్ కలర్ స్కీమ్‌కి అపోసిట్‌గా ఉంటుంది. కంపెనీ డ్యాష్‌బోర్డ్, డోర్ ప్యాడ్‌లపై లెథెరెట్ ట్రిమ్‌ను అందించింది, ఇవి టాప్-స్పెక్ ZX ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మీరు అపెక్స్ ఎడిషన్‌లో ప్రత్యేక సీట్ అప్హోల్స్టరీ, కుషన్‌లతో పాటు యాంబియంట్ లైటింగ్‌ను కూడా పొందుతారు.


ఎలివేట్ V, VX వేరియంట్ మెకానిజంలో ఎటువంటి మార్పులు లేవు. ఎలివేట్ కోసం కస్టమర్‌లు డిఫరెంట్ ఎక్స్‌టీరియర్, ఇంటర్నల్ ప్యాకెజ్‌లను సెలక్ట్ చేసుకోవచ్చు. అపెక్స్ ఎడిషన్ ఇంటీరియర్ ప్యాకేజీ ధర రూ. 10,000 కాగా, ఎక్స్‌టీరియల్ ప్యాకేజీ ధర రూ. 5,000. హోండా ఎలివేట్ 121hp, 1.5-లీటర్, నాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఎలివేట్ అపెక్స్ ఎడిషన్‌తో 6-స్పీడ్ మాన్యువల్, 7 స్టెప్ CVT గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.


హోండా ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ గురించిహోండా కార్స్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బహ్ల్ మాట్లాడుతూ.. మా విజయంలో ఎలివేట్ కీలక పాత్ర పోషించింది. భారతదేశంలో మా అమ్మకాలు, ఎగుమతులకు కూడా గణనీయంగా దోహదపడింది. పండుగ సీజన్‌లో,కొత్త అపెక్స్ ఎడిషన్‌ను లాంచ్ చేయడానికి మేము సంతోషిస్తున్నాము. ఇది బోల్డ్ కొత్త ఎక్స్‌టీరియర్ ఎలిమెంట్స్‌తో కలిసి దాని డైనమిక్, స్టైలిష్ అప్పీల్‌ను మెరుగుపరుస్తుంది. మేము మరింత మంది కస్టమర్‌లను హోండా ఫ్యామిలీకి స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాము.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com