ఇంగ్లాండ్ లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయం మద్దతుతో NHS బ్లడ్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ పరిశోధకులు కనుగొన్న కొత్త బ్లడ్ గ్రూపునకు MAL అని పేరు పెట్టారు.
1972లో మొదటిసారిగా AnWj యాంటిజెన్ గుర్తించగా.. ఇది అప్పరికే ఉన్న ఏ ఒక్క బ్లడ్ గ్రూపులతో సరిపోలలేదు. దీంతో ఈ యాంటిజెన్ ఉన్న రోగులకు చికిత్సలలో సమస్యలు ఎదురయ్యేవి. తాజాగా AnWj యాంటిజెన్ 'మాల్' అనే కొత్త బ్లడ్ గ్రూప్ కు చెందినదని గుర్తించారు.