రేడియో సిగ్నల్స్ ద్వారా చిన్న సందేశాలను పంపడానికి, స్వీకరించడానికి ఉపయోగించే వైర్ లెస్ ఎలక్ట్రానిక్ పరికరమే పేజర్. దీన్నే బీపర్ అని కూడా అంటారు.
మొబైల్ ఫోన్లు వాడుకలోకి రాకముందు ఈ పరికరాలను విస్తృతంగా ఉపయోగించేవారు. ఇవి అలర్ట్ వచ్చినప్పుడు బీప్ సౌండ్ తో నంబర్ లేదా టెక్స్ట్ మెసేజ్లను చూపిస్తాయి. ట్రాక్ చేసే వీలు లేనందున హెజ్బొల్లా వీటిని వాడుతోంది. మంగళవారం లెబనాన్ అంతటా వందలాది పేజర్లు పేలడంతో వేల మంది గాయపడ్డారు.