టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను భారతదేశానికి అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ అదే సమయంలో T20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇంతలో, బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ముందు, రోహిత్ ఇంటర్వ్యూ వెలువడింది. ఈ క్రమంలో రిటైర్మెంట్ తర్వాత నిర్ణయాన్ని మార్చుకుని, మళ్లీ ఆడటం ప్రారంభించిన ప్రపంచంలోని చాలా మంది క్రికెటర్లను లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశాడు. చాలామంది రిటైర్మెంట్‌ను జోక్‌గా మార్చేస్తున్నారని రోహిత్ వాపోయాడు.రోహిత్ శర్మ 14 ఏళ్లుగా భారత టీ20 జట్టులో భాగమైన సంగతి తెలిసిందే. అతను 2007 T20 ప్రపంచ కప్ నుంచి 2024 T20 ప్రపంచ కప్ వరకు భారత జట్టుతో కలిసి ప్రయాణించాడు. రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా కూడా టైటిల్ విజయం తర్వాత టీ20 ఇంటర్నేషనల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
జియో తో ప్రత్యేక సంభాషణలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ''ఈ రోజుల్లో రిటైర్మెంట్ అనేది ప్రపంచ క్రికెట్‌లో ఒక జోక్‌గా మారింది.. క్రికెటర్లు ముందుగా రిటైర్మెంట్ ప్రకటిస్తారు. తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చి మళ్లీ ఆడతారు. మన ఇండియాలో ఎప్పుడూ ఇలా జరగలేదు. అయితే, ఇతర దేశాల ఆటగాళ్లంటే నాకు చాలా అభిమానం. రిటైర్మెంట్ ప్రకటించి యూ-టర్న్ తీసుకుంటున్నారు. అయితే, అసలు ఎందుకు రిటైర్మెంట్ చేస్తున్నారో వారికే తెలియదు. నేను T20కి వీడ్కోలు చెప్పడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్ టైటిల్ విజయంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఈ సమయంలో, రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 36.71 సగటుతో మొత్తం 257 పరుగులు చేశాడు. రహ్మానుల్లా గుర్బాజ్ తర్వాత, టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ కెరీర్‌ను పరిశీలిస్తే, అతను భారతదేశం తరపున మొత్తం 159 T20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 140.89 స్ట్రైక్ రేట్‌తో 5 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు సాధించి మొత్తం 4231 పరుగులు చేశాడు.