ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసీస్ మాజీ దిగ్గజం షేన్ వార్న్‌తో సమంగా నిలిచిన అశ్విన్

sports |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2024, 04:16 PM

చెన్నై వేదికగా భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదం తొక్కిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో అశ్విన్ తన కెరీర్‌లో మరో రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. బంగ్లాపై అద్భుత ప్రదర్శనతో కెరీర్‌లో 37వ సారి 5 వికెట్లు తీసిన ఘనతను అశ్విన్ అందుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు, మాజీ దిగ్గజం షేన్ వార్న్ రికార్డును సమం చేశాడు. వార్న్ కూడా తన టెస్ట్ కెరీర్‌లో 37 సార్లు 5 వికెట్లు తీశాడు. అయితే వార్న్ కంటే 81 ఇన్నింగ్స్ ముందుగానే అశ్విన్ ఈ ఘనతను సాధించడం విశేషం.కాగా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ శ్రీలంక మాజీ దిగ్గజం తన కెరీర్‌లో ఏకంగా 67 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 230 ఇన్నింగ్స్‌ ఆడి ఈ రికార్డును నెలకొల్పాడు. 


టెస్టుల్లో అత్యధికంగా 5 వికెట్లు బౌలర్లు వీళ్లే


1. ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) - 67 సార్లు ( 230 ఇన్నింగ్స్‌)


2. అశ్విన్ (భారత్) - 37 సార్లు (191 ఇన్నింగ్స్‌)


3. షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) - 37 సార్లు (273 ఇన్నింగ్స్‌)


4. సర్ రిచర్డ్ హ్యాడ్లీ (న్యూజిలాండ్) - 36 సార్లు (150 ఇన్నింగ్స్‌)


5. అనిల్ కుంబ్లే (భారత్) - 35 సార్లు (236 ఇన్నింగ్స్‌).


మరోవైపు టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ మాజీ కోర్ట్నీ వాల్ష్‌ను అశ్విన్ అధిగమించాడు. వాల్ష్ 519 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ ప్రస్తుతం 522 వికెట్లు తీసి ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచాడు. ఇదిలావుంచితే.. సొంత మైదానంలో అశ్విన్ అద్భుత బౌలింగ్‌ ముందు బంగ్లాదేశ్ బ్యాటర్లు తేలిపోయారు. భారీ లక్ష్య ఛేదనలో 234 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో భారత్ ఏకంగా 280 పరుగుల తేడాతో ఘటన విజయాన్ని సాధించింది. 2 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కాగా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లలో రాణించిన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డ్‌ అందుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com