చెస్ ఒలింపియాడ్ 2024లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓపెన్ విభాగంలో తొలిసారి స్వర్ణ పతకాన్ని సాధించింది. గోల్డ్ సాధించిన భారత జట్టులో డి.గుకేష్, ఆర్. ప్రజ్ఞానానంద, అర్జున్ ఇరిగైసి, విదిత్ గుజరాతీ, పెంటేల హరికృష్ణ, శ్రీనాథ్ నారాయణన్ ఉన్నారు. చెస్ ఒలింపియాడ్‌లో భాగంగా బుడాపెస్ట్ వేదికగా జరిగిన ఫైనల్లో భారత పురుషుల జట్టు స్లోవేనియాతో తలపడి గెలిచింది. అర్జున్ ఇరిగైసి, డి.గుకేష్ తమ తమ మ్యాచ్‌లలో విజయాలు సాధించడంతో చారిత్రాత్మక రీతిలో బంగారు పతకం ఖాయమైంది. వీరిద్దరు తమ రౌండ్-11లో అద్భుతమైన విజయాలు నమోదు చేసి భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించారు.ఇక, ఓపెన్ కేటగిరిలో చైనా రెండవ స్థానానికి పడిపోయింది. అమెరికాపై రెండు బోర్డులపై పాయింట్లు కోల్పోవడంతో చైనాకు రెండవ స్థానం తప్పలేదు. గత ఎడిషన్‌లో భారత్ శుభారంభం చేసినప్పటికీ పతకం దక్కకపోవడంతో నిరాశే ఎదురైంది. ఇక సొంతగడ్డపై 2022లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో భారత్ కు కాంస్య పతకం దక్కింది. అంతకుముందు 2014లో కూడా మన చెస్ ప్లేయర్స్ కాంస్యం గెలిచారు