కొన్ని రకాల సూపర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. దీనికోసం ప్రతి రోజూ 2 బాదం పప్పులు తినాలని సూచిస్తున్నారు. దీని వల్ల శరీరానికి ప్రోటీన్, ఫైబర్ అందుతుందని తెలిపారు. అల్లాన్ని కూడా రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ ఫెక్షన్లు రాకుండా రక్షిస్తాయి. నిమ్మకాయ, వెల్లుల్లి, సీజనల్‌గా లభించే పండ్లను ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారని సూచించారు.