పాకిస్థాన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ ఆజమ్ తప్పుకున్నాడు. ఈ మేరకు తాజాగా బాబర్ ప్రకటించాడు. కెప్టెన్సీ నుంచి బాబర్ తప్పుకోవడం ఇది రెండోసారి. పాకిస్థాన్ బోర్డుకు తన ఆలోచన గతంలోనే విన్నవించుకున్నట్లు చెప్పాడు.
కెప్టెన్సీ వత్తిడి నుంచి బయటపడి బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. గత నెలలోనే ఈ నిర్ణయాన్ని పీసీబీకి చెప్పినట్లు తెలిపాడు.