ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉసిరితో ఆరోగ్య లాభాలు

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2024, 10:18 AM

వచ్చేది ఉసిరికాయల సీజన్.. ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ఉసిరితో ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు తగ్గించుకోవచ్చు.ప్రాచీన కాలం నుంచి ఉసిరిని ఔషధంగా వాడుతున్నారు.. ఉసిరిని నేరుగా తిన్నా.. జ్యూస్ తాగినా ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరిని సింపుల్‌గా సూపర్‌ ఫుడ్‌ అని పిలుస్తారు. ఉసిరిలో విటమిన్‌ సీ,¯ కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, బీ-కాంప్లెక్స్‌తోపాటు ఇతర విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఔషధ గుణాలూ పుష్కలంగా ఉంటాయని నిపుణుల చెబుతున్నారు. ఉసిరి రోజు తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..ఉసిరిని ఎలా తీసుకున్నా శరీరానికి పోషకాలు అందుతాయి. అయితే ముఖ్యంగా ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఉసిరి తినడం వల్ల మరింత బెటర్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి కాయ నమిలి తినడం వల్ల బ్లడ్‌ షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరి దివ్యషధంగా పని చేస్తుంది. ఇందులో ఉండే క్రోమియం రక్తంలో చక్కెర స్థాయిన అదుపులో ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది. అధిక బరువు తగ్గాలి అనుకునే వారు ఉసిరి తినడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఉసిరిలో ఫైబర్ అనేది ఎక్కువగా లభిస్తుంది. ఇది త్వరగా ఆకలి వేయకుండా కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.


 


ఉసిరిలో ఉండే పోషకాలు గట్ హెల్త్‌కి చాలా మంచి చేస్తుంది. మల బద్ధకం సమస్య, చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. కాబట్టి త్వరగా బరువు తగ్గుతారు. బెల్లీ ఫ్యాట్ కూడా కరుగుతుంది. ఉసిరి కాయ నమిలి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గునాలు, యాంటీ గ్లైసమిక్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో చక్కగా హెల్ప్ చేస్తుంది.


 


ఉసిరి నమిలి తినడం వల్ల చర్మం, జుట్టు సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. ముడతలు, మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం క్లియర్‌గా అవుతుంది. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఉసిరి తినడం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా, బలంగా తయారవుతుంది. జుట్టు రాలడం, చుండ్రు తగ్గుతుంది. కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు కూడా నిగనిగలాడుతూ ఉంటుంది. ఉసిరి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com