బరువు తగ్గడానికి చాలా మంది రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు జిమ్‌కి వెళ్లి కష్టపడుతుంటారు. అయితే రోజూ జిమ్‌కి వెళ్లి ఎక్సర్‌సైజ్ చేయటం కుదరకపోవచ్చు. అయితే బరువు తగ్గాలంటే నడక సులువైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. నడవడంతో పాటు మెట్లు ఎక్కడం, దిగడం వలన చేతులను కూడా కదిలిస్తాం కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలు కరిగిపోతాయి. దీంతో త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.