కలబంద జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కలబందలో విటమిన్ ఎ, సీ, ఇ, బి కాంప్లెక్స్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, అమైనో ఆమ్లాలు వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. అంతేగాక షుగర్‌ను కూడా కంట్రోల్ చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.