ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే ఇవి బరువు పెరగడానికి దోహదపడటంతో పాటు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన అనారోగ్యాలను కలిగిస్తుందని తేలింది. కేవలం ఒక సర్వింగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం వల్ల 25 సిగరెట్లు తాగినంత హానికరమని హెచ్చరిస్తున్నారు. ఇందులో ఉండే ట్రాన్స్ ఫ్యాట్లు శరీరంలో పేరుకుపోయి హృదయనాళ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.