సుగంధ ద్రవ్యాల్లో ఏలకులు కూడా ఒకటి.. ఏలకుల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. వీటిని వంటల్లో వేయడం ద్వారా.. వాటి రుచి సువాసన రెట్టింపవుతుంది.. దీంతోపాటు ఆరోగ్యానికి చాలా మంచిది..అందుకే.. డైలీ డైట్ లో యాలకులను భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఏలకులలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, టెర్పెనెస్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటాయి. ఈ సమ్మేళనాలు కణాలను దెబ్బతినకుండా రక్షించడానికి, వాపును తగ్గించడానికి, మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. యాలకులు రక్తపోటును తగ్గిస్తాయి.. ఇంకా శ్వాసను మెరుగుపరుస్తుంది.. బరువు తగ్గడానికి సహాయపడుతాయి. ఏలకులు తీసుకోవడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్, డయాబెటిస్ వంటి పరిస్థితులతో పోరాడటంతో పాటు నోటి, గుండె, కాలేయ ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. డైలీ రెండు ఏలకులు తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి..
ఏలకులు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మాంసాహారం లేదా శాఖాహారంలో ఏలకులను చేర్చడం లేదా నమలి తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఏసిడిటీ, గ్యాస్, ఉబ్బరం తగ్గిస్తుంది.ఏలకులు అనేక రకాల యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇది శరీరంలో రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఏలకులు నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.ఏలకులు మనస్సు, శరీరాన్ని సంతోషంగా ఉంచుతాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఆందోళన లేదా డిప్రెషన్ నుండి ఉపశమనం పొందవచ్చు. ఏలకులలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. అలాగే, ఇది మీ ముఖంలోని టాక్సిన్స్ ను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.వర్షాకాలం వచ్చిందంటే దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యలకు ఏలకుల నీరు మంచిది. ఏలకులలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అన్ని రకాల గొంతు సంబంధిత సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది.
మహిళలు బహిష్టు సమయంలో తీవ్రమైన కడుపునొప్పి, కండరాల తిమ్మిరితో బాధపడుతుంటారు. ఏలకుల నీరు మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. ఏలకుల నీటిలో యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది హార్మోన్ల అసమతుల్యత నుండి ఉపశమనం పొందడమే కాకుండా త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.