చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో (OPPO) భారత్‌లో దీపావళి సేల్‌ను ప్రారంభించింది. ప్రత్యేక డిస్కౌంట్లతో ఈ డీల్ తీసుకొచ్చింది.ఎంపిక చేసిన వాటి కొనుగోళ్లపై క్యాష్ ప్రైజ్‌లు, ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ ఫోన్లను అందించనుంది. నో కాస్ట్ ఈఎంఐ, జీరో డౌన్ పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీ, ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఈ సేల్ ప్రారంభమైంది. నవంబర్ 7 వరకు అందుబాటులో ఉంటుంది.'' పే జీరో, వర్రీ జీరో, విన్ రూ.10 లక్షలు'' పేరిట దీపావళి సేల్‌ను ఒప్పో తీసుకొచ్చింది. ఈ సేల్‌లో ఒప్పో రెనూ 12 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్27 ప్రో+ 5జీ ఫోన్లపై 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందిస్తోంది. కోటక్ బ్యాంక్, టీవీఎస్ ఫైనాన్స్, హెచ్డీబీ ఫైనాన్స్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ యూజర్లకు ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు జీరో ప్రాససింగ్ ఫీ, ఏడాది పాటు జీరో డౌన్ పేమెంట్ సదుపాయం అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ, బీఓబీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, కోటక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఆర్బీఎల్, డీబీఎస్, ఫెడరల్ బ్యాంక్ యూజర్లకు 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చని తెలిపింది.
ఒప్పో రెనో 11 సిరీస్, ఒప్పో ఎఫ్25 ప్రో, ఒప్పో ఎఫ్27 5జీ, ఒప్పో ఏ3 ప్రో5జీ, ఒప్పో కే12 ఎక్స్ 5జీ ఫోన్లపై పెద్దఎత్తున డిస్కౌంట్లు ప్రకటించింది. నవంబర్ 7లోపు కొనుగోలు చేసేవారికి ఒప్పో ఫైండ్ ఎ3 ఫ్లిప్, ఒప్పో ఎక్నో బడ్స్2, ఒప్పో ప్యాడ్, లక్ష రూపాయలు గెలుచుకొనే అవకాశం లభిస్తుంది. అంతేకాదు స్క్రీన్ ప్రొటెక్షన్, ఒప్పో కేర్+ సబ్స్క్రిప్షన్, రివార్డ్ పాయింట్లు, క్యాష్ ప్రైజ్ కైవసం చేసుకోవచ్చని పేర్కొంది. ఒప్పో రిటైల్ స్టోర్, ఒప్పో ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేసినవారు ఈ ప్రయోజనాలు పొందొచ్చు.